Share News

Gold Rates On Nov 27: ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 07:38 AM

ఇవాళ (నవంబర్ 26) కొంతకాలంగా చుక్కలనంటిన బంగారం ధరలు ఇటీవల కొంతమేర దిగివచ్చి ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు గత వారంతో పోలిస్తే మరింత బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.

Gold Rates On Nov 27:  ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
Gold Rates Today

ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ మార్కెట్లో బంగారం ధర బాగానే పెరిగింది. 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,27,050కి చేరుకుంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,460 గాను, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 95, 290 గా ఉంది. వెండి కిలో ధర రూ.100 మేర పెరిగి.. 1,67,100 లుగా ఉంది. ఇటీవల లక్షా 30 వేల మార్క్ దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :

హైదరాబాద్‌:

బంగారం 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.1,27,050 ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,16,460 ఉంది. వెండి కిలో ధర రూ.1,74,100

విజయవాడ, విశాఖపట్నం:

బంగారం 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.1,27,050. 22 క్యారెట్ల ధర రూ.1,16,460. కిలో వెండి ధర రూ.1,74,100

చెన్నై:

24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,27,870. 22 క్యారెట్ల ధర రూ.1,17,210. వెండి కిలో ధర రూ.1,74,100

బెంగళూరు:

24 క్యారెట్ల ధర రూ.1,27,050, 22 క్యారెట్లు రూ.1,16,460. వెండి కిలో ధర రూ.1,67,100


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.


ఈ వార్తలు కూడా చదవండి..

పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 07:54 AM