Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర
ABN , Publish Date - Apr 23 , 2025 | 08:04 PM
అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు చక్కబడతుండటంతో గోల్డ్ హై రికార్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది. మొన్న నిన్న లక్షకు పైగా దాటి రికార్డుల మోత మోగించిన ఈ విలువైన లోహం ఇవాళ భారీగా తగ్గింది.

Gold halts record rally: అమెరికా-చైనా టారిఫ్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో బంగారం ధర రికార్డు స్థాయి ర్యాలీని ఆపింది. ఇవాళ (బుధవారం) కాస్త నెమ్మదించింది. ఒకే రోజులో రూ.2,400 తగ్గి రూ.99,200(10 గ్రాములు)గా ఉంది. దేశ జాతీయ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు చారిత్రాత్మక రూ.1 లక్ష మార్కు నుండి U-టర్న్ తీసుకున్నాయి. నేడు రూ.2,400 తగ్గి రూ.99,200కు చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9% స్వచ్ఛత కలిగిన ఈ విలువైన లోహం మంగళవారం నాడు రూ.1,800 పెరిగి 10 గ్రాములకు రూ.1,01,600 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. స్థానిక మార్కెట్లలో అయితే, నిన్న 10 గ్రాములకు రూ.2,800 పెరిగి రూ.1,02,100 ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
అయితే, ఇవాళ (బుధవారం) 10 గ్రాములకు 99.5% బంగారం రూ.3,400 తగ్గి రూ.98,700కు చేరుకుంది. వాణిజ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న సమయంలో చైనా వస్తువులపై విధించిన అధిక సుంకాలను త్వరలో గణనీయంగా తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత, సురక్షిత స్వర్గధామమైన బంగారం డిమాండ్ కాస్త తగ్గింది. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ఇవాళ కాస్త సర్దుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, బుధవారం వెండి ధరలు కిలోకు రూ.700 పెరిగి రూ.99,200కి చేరుకుంది. గత సెషన్‌లో వెండి ధర కిలోకు రూ.98,500 వద్ద స్థిరంగా ముగిసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, జూన్ డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,435 లేదా 1.47% తగ్గి రూ.95,905కి చేరుకుంది. మునుపటి మార్కెట్ ముగింపులో ఇది 10 గ్రాములకు రూ.99,358 రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. అదనంగా, ఆగస్టు కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ.1,330 లేదా 1.36% తగ్గి రూ.96,669కి చేరుకుంది. MCXలో ఇది చారిత్రాత్మక గరిష్ట స్థాయి కూడా.
కాగా, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లలో బంగారం ధరలు చూస్తే.. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹9,835, పది గ్రాములు రూ.98,350గా ఉంది. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹9,015 మరియు 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) ₹7,376 గా ఉంది. అటు, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:
ఉగ్ర వేట.. జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
సగం సీజన్‌కే 111 క్యాచులు మిస్
For More National News and Telugu News..