Share News

Money Tracking Apps: ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:15 PM

ఖర్చులు చేయి దాటిపోతున్నాయని ఆందోళనా? అయితే, ఈ యాప్స్‌‌ను ఓసారి ట్రై చేసి చూడండి. రాబడి పోబడులన్నిటినీ పక్కాగా ట్రాక్ చేసే ఈ యాప్స్‌తో వృథా వ్యయాలను సులువుగా అరికట్టొచ్చని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

Money Tracking Apps: ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి
Money Tracking Apps

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చెల్లింపులకు రకరకాల మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో, డబ్బు ఖర్చుపై కన్నేసి ఉంచడం కష్టంగా మారింది. మనకు తెలియకుండానే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయితే, ఈ ఖర్చులకు పగ్గాలు వేసి పొదుపునకు మార్గం సుగమం చేసే కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చాలా మటుకు ఉచితమే. మరి ఈ యాప్స్‌ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Best Money Tracking Apps)

యాక్సియో యాప్ మంచి పాప్యులారిటీ సాధించింది. ఖర్చులను ట్రాక్ చేసేందుకు ఉద్దేశించిన ఈ యాప్‌తో డబ్బు చెల్లింపులపై నిఘా పెట్టొచ్చు. మొబైల్ నెంబర్ ఆధారంగా ఈ యాప్ వివిధ బ్యాంక్ అకౌంట్‌లను, క్రెడిట్ కార్డులను లింక్ చేస్తుంది. మొబైల్‌కు వచ్చే మెసేజీల ఆధారంగా ఖర్చులపై నిఘా పెడుతుంది. చెల్లింపులకు సంబంధించి యూజర్లు నెలవారీ టార్గెట్స్‌‌ను ఈ యాప్‌లో సెట్ చేసుకోవచ్చు. బిల్లులు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యాప్ యూజర్లకు రిమైండర్ల ద్వారా గుర్తు చేస్తూ ఉంటుంది.


ఏవైనా లక్ష్యాల కోసం ప్రత్యేకంగా డబ్బు ఆదా చేయాలనుకునే వారికి లూట్ ఉపయుక్తం. ఇందులోని వర్చువల్ సేవింగ్స్ జార్.. మీరు డబ్బు డిపాజిట్ చేసే కొద్ది నిండుతున్నట్టు కనిపిస్తుంది. రోజువారీ, నెలవారీగా ఎంతెంత పొదుపు చేస్తున్నదీ యూజర్లు ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక పొదుపు చర్యలకు ఇది చాలా ఉపయుక్తం అని యూజర్లు చెబుతుంటారు.

ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ కోసం ఉద్దేశించిన సమగ్ర సాధనం మింట్ యాప్. ఇందులో బడ్జెటింగ్, క్రెడిట్ స్కోరు మానిటరింగ్ కోసం ప్రత్యేక సాధనాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు అలర్ట్‌లను పంపించే ఫీచర్ ఇందులో ఉంది. యాపిల్ వాచ్ సపోర్టు కూడా ఇందులో అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఆన్‌లైన్ ఫైనాన్స్ అకౌంట్‌లను దీనికి జత చేసి రాబడి పోబడులపై సమగ్ర నిఘా పెట్టొచ్చు. అయితే, ఇది అమెరికా, కెనడాలోని యూజర్లకే అందుబాటులో ఉంది.


యాక్సియో లాగా ఖర్చులపై నిఘా కోసం ఉద్దేశించిన యాప్ వాలెట్. ఇది బ్యాంక్ అకౌంట్‌లకు కనెక్ట్ అయ్యి డాటాను ఆటోమేటిక్‌గా డౌన్ లోడ్ చేస్తుంది. రాబడి పోబడులపై సమగ్ర నివేదికలను సిద్ధం చేస్తుంది. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి వాటిపై కూడా ఈ యాప్‌తో నిఘా పెట్టొచ్చు. ఆటోమేటిక్ క్లౌడ్ సింక్రోనైజేషన్, ట్రాన్సాక్షన్ లొకేషన్ ట్రాకింగ్, డెట్ మేనేజ్‌మెంట్ వంటివి ఇందులో అందుబాటులో ఉన్నాయి.

రియల్ బైట్ ఇంక్ సంస్థ రూపొందించిన మనీ మేనేజర్‌తో ఖర్చులు, చెల్లింపులకు సంబంధించి రోజువారీ, నెలవారీగా నివేదికలు పొందొచ్చు. ఈ యాప్ ఉచిత వర్షెన్‌లో యాడ్స్ ఉంటాయి. ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ కచ్చితంగా నిర్వహించాలనుకునే వారికి ఇది మంచి సాధనం.

ఇవీ చదవండి:

చాట్‌జీపీటీతో 30 రోజుల్లో రూ.10 లక్షల అప్పు తీర్చేసిన మహిళా రియల్టర్

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 12:33 PM