Share News

Credit Card Kept Inactive: క్రెడిట్ కార్డు వాడి చాలా రోజులైందా.. నెక్ట్స్ జరిగేది ఇదే..

ABN , Publish Date - May 12 , 2025 | 09:46 PM

క్రెడిట్ కార్డు వాడకపోతే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా అనే చాలా మందికి సందేహం ఉంటుంది. దీనికి నిపుణులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.

Credit Card Kept Inactive: క్రెడిట్ కార్డు వాడి చాలా రోజులైందా.. నెక్ట్స్ జరిగేది ఇదే..
credit card inactivity

ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డులు మన నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి. మంచి క్రెడిట్ స్కోరు పెంచుకునేందుకు కూడా ఇవి కీలకం. క్రెడిట్ స్కోరు బాగుంటే రుణాలు పొందటం సులభతరం అవుతుంది. ఇక ప్రస్తుతం చాల మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. దీంతో కొన్ని కార్డులను వాడకుండా వదిలేస్తున్నారు. మరి ఇలా చేస్తే పర్యవసానాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు ఎక్కువ రోజులు వాడకపోతే అది నిద్రాణస్థితిలో ఉన్నట్టు బ్యాంకులు డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు ఆరు నెలల తరువాత మరికొన్ని ఏడాది తరువాత ఇలాంటి ప్రకటన చేస్తాయి. ఇది బ్యాంకులను బట్టి మారుతుంటుంది. అయితే, కార్డును డార్మెంట్‌గా ప్రకటిస్తున్నట్టు ముందుగా కార్డుదారులకు సమాచారం అందించాకే ఈ ప్రకటన చేస్తాయి.

కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఇలాంటి కార్డులను క్లోజ్ చేస్తాయి. ముందు హెచ్చరికలు పంపించాకే వాటిని క్లోజ్ చేస్తాయి. మంచి క్రెడిట్ హిస్టరీ గనుక ఉన్నట్టైతే కార్డును తొలగించినప్పుడు ప్రతికూల ప్రభావం పడుతుంది.


క్రెడిట్ కార్డు దారులు బ్యాంకులకు వార్షిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కార్డులు వాడకపోయినా ఈ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో, కార్డుపై ఖర్చులు తప్పవు.

క్రెడిట్ కార్డుకు ఉన్న ప్రధాన ఆకర్షణల్లో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు ముఖ్యమైనవి. కార్డును తరచూ వాడకపోతే ఈ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. గతంలో గెలుచుకున్న రివార్డు పాయింట్ల గడువు కూడా ముగిసి అవి వృథా అయిపోతాయి.

అధిక క్రెడిట్ లిమిట్ ఉన్నా కార్డులను ఎక్కువగా వాడకపోతే క్రెడిట్ యూటిలైజేషన్ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. ఫలితంగా క్రెడిట్ కార్డు స్కోరు పెరుగుతుంది. అదే కార్డు మూసేస్తే మాత్రం క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.


కాబట్టి, క్రెడిట్ కార్డు దారులు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి కార్డు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూ ముందుకెళితే కార్డు ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

US-China: ట్రేడ్ వార్‌కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 12 , 2025 | 09:57 PM