Credit Card Bill EMI: క్రెడిట్ కార్డ్ బిల్లును EMIకి మార్చితే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా ?
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:07 PM
క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. తమ తాహతుకు మించి కార్డులు ఉపయోగించి మొత్తం బిల్లు ఒకే సారి కట్టలేక, వాటిని ఈఎంఐలలో చెల్లించేలా మార్చుకోవడం కూడా జరుగుతుంటుంది. అయితే, క్రమశిక్షణతో మెలగకపోతే మీ క్రెడిట్ ప్రొఫైల్..
ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డుల వాడకం దేశంలో బాగా పెరిగింది. బిల్లు ఒకే మొత్తంలో చెల్లించలేని పక్షంలో సదరు బిల్లును ఈఎంఐలోకి మార్చుకునే వెసులుబాటు కూడా ఆయా బ్యాంకులు అందిస్తుంటాయి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుందా అనే సందేహం సహజమే. అయితే, మీరు ఈఎంఐ మొత్తాలు టైమ్ ప్రకారం చెల్లిస్తే, మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. క్రెడిట్ ప్రొఫైల్ కూడా మెరుగవుతుంది.
ఈఎమ్ఐ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం వల్ల మీరు చెల్లించే వడ్డీ పెరిగే అవకాశం ఉంది(ఆఫర్లు మినహా). దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ సహా ఇతర ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన సమయం కూడా పెరిగిపోతుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్డు మీద ఉన్న క్రెడిట్ లిమిట్ పరిమితులకు లోబడి వాడుకోవాలి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో(CUR) పెరగకుండా చూసుకోవాలి. సాధారణంగా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతంగా ఉంటుంది. దీన్ని దాటి ఖర్చు చేస్తే, సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఈఎంఐలతో కూడిన క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టగలం అనుకుంటే మాత్రమే ఈఎంఐలలోకి మార్చుకోవడం ఉత్తమం.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు ఆంధ్రజ్యోతి ఎలాంటి బాధ్యత వహించదు. పాఠకులు జమాఖర్చులు, డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచింది.
ఇవి కూడా చదవండి..
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News