Share News

Closing Credit Card: క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..

ABN , Publish Date - Jul 25 , 2025 | 10:56 PM

క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ప్రభావాన్ని పరిమితం చేయాలనుకుంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Closing Credit Card:  క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..
credit card cancellation impact

ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం ఓ ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం. దీని వల్ల క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే, కొన్ని సార్లు క్రెడిట్ కార్డులను డీయాక్టివేట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ స్కోరు ప్రభావితం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై పడే ప్రభావం గురించి అనేక మంది ఆందోళన చెందుతుంటారు. డీయాక్టివేషన్ తరువాత క్రెడిట్ లిమిట్ తగ్గుతుంది. ఫలితంగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో పెరుగుతుంది. క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసే అంశాల్లో ఈ రేషియో ముఖ్యమైనది. అంతేకాకుండా, చాలా కాలం పాటు వాడిన క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే రుణ చరిత్ర తగ్గుతుంది. ఫలితంగా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇలాంటి సమయాల్లో సరైన నిర్ణయం తీసుకునేందుకు క్రెడిట్ స్కోరు సిమ్యులేటర్లు ఉపయోగపడతాయి. మీ ఆర్థిక చర్యల ద్వారా క్రెడిట్ స్కోరుపై పడే ప్రభావం ఎంతో ఈ సాధనాల ద్వారా తెలుసుకోవచ్చు.


నిపుణులు చెప్పే దాని ప్రకారం, క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజులు లేని సందర్భాల్లో క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయకుండా ఉండటమే మంచిది. క్రెడిట్ కార్డులతో ప్రయోజనాలకంటే వార్షిక ఫీజులు అధికంగా ఉంటే కార్డును డీయాక్టివేట్ చేసుకోవచ్చు. వడ్డీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నా కార్డును డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక భద్రతా పరమైన సమస్యలు వచ్చినప్పుడు కార్డును డీయాక్టివేట్ చేయడం మినహా మరో మార్గం ఉండదు.

ఇలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా క్రెడిట్ కార్డుపై ఉన్న బాకీలన్నిటినీ తీర్చేయాలి. లేట్ ఫీజులు మిగిలుంటే చెల్లించాలి. దీంతో, క్రెడిట్ స్కోరుకు నష్టం చాలా వరకూ తగ్గుతుంది. డీయాక్టివేట్ చేయదలిచిన కార్డుతో అదనపు లావాదేవీలు ఏవీ నిర్వహించకూడదు. కార్డుపై రివార్డు పాయింట్స్ ఉంటే వాటిని రిడీమ్ చేసుకోవాలి. ఆటోపేమెంట్స్ వంటివాటిని క్యాన్సిల్ చేయాలి. ఆ తరువాత సంబంధిత బ్యాంకుకు కార్డు డీయాక్టివేషన్ కోసం లిఖితపూర్వకంగా అభ్యర్థనను సమర్పించాలి. ఆ తరువాత నాలుగు నుంచి ఆరు వారాల్లో కార్డు డీయాక్టివేట్ అయిపోతుంది.


ఇవీ చదవండి:

బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్

సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..

Read Latest and Business News

Updated Date - Jul 25 , 2025 | 11:08 PM