Bank Holidays in November: అలర్ట్.. నవంబర్‌లో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:58 AM
నిత్యం బ్యాంకులకు వెళ్లే వాళ్లు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకోవాలి. ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులు వచ్చాయి. సెలవులు ఎప్పుడంటే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం బ్యాంకు పనులు అనేకం ఫోన్‌లోనే చక్కబెట్టేస్తున్నాం. కానీ, కొన్ని ముఖ్యమైన పనులకు ఇప్పటికీ బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు సెలవులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. లేకపోతే.. పనులు వాయిదా పడి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సెలవులు ఎప్పుడో తెలుసుకుని పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావు (Bank Holidays In November).
నవంబర్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటకలో నవంబర్ 1న అన్ని బ్యాంకులకూ సెలవు. బుద్ధి దీపావళి నేపథ్యంలో ఈ రోజు డెహ్రాడూన్‌లో కూడా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 5: గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహాస్ పూర్ణిమ నేపథ్యంలో ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 7: వంగల పండుగను పురస్కరించుకుని ఈ రోజు కూడా షిల్లాంగ్ నగరంలో బ్యాంకులకు సెలవు
నవంబర్ 8: కనకదాస జయంతి నేపథ్యంలో బెంగళూరులో ఈ రోజు బ్యాంకులకు సెలవు.
నవంబర్ 11: లహాబ్ డ్యూచెస్ పండుగను పురస్కరించుకుని సిక్కింలో ఈ రోజు బ్యాంకులకు సెలవు
నవంబర్ 25: గురు తేజ్ బహదూర్ జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లో బ్యాంకులు బంద్.
నవంబర్ 8, నవంబర్ 22: రెండు, నాలుగో శనివారం కావడంతో ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులన్నిటికీ సెలవు.
నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్16, నవంబర్ 23: ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఈ సెలవు రోజుల్లో బ్యాంకులు మూసే ఉన్నప్పటికీ ఆన్‌లైన్, మొబైల్ సేవలన్నీ యథాతథంగా అందుబాటులో ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఏటీఎమ్‌ల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకు సెలవులకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఏటా క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల.. ఎప్పుడంటే..?
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి