Share News

Salary-Budgeting: వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

ABN , Publish Date - Jul 18 , 2025 | 02:56 PM

జీవితంలో ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వేతన జీవులు తప్పనిసరిగా పాటించాల్సిన ఫార్ములా 50-30-20. అంటే జీతంలో 50 శాతం అవసరాలకు, మరో 30 శాతం నచ్చిన వస్తువుల కొనుగోలుకు, మిగతా 20 శాతం పొదుపునకు కేటాయిస్తే లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Salary-Budgeting: వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
Salary 50-30-20 rule

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి అవసరాలకు సరిపడా డబ్బు ఉండదు. మరి కొందరికీ ఖర్చు విషయంలో అదుపు ఉండదు. దీంతో ఎంత సంపాదించినా నెలాఖరుకు రిక్త హస్తాలే మిగులుతాయి. అయితే, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు ఓ ముఖ్య సూచన చేస్తున్నారు. ఈ సూచనను యథాతథంగా ఫాలో అయితే లైఫ్‌లో నిశ్చితంగా ఉండొచ్చట. మరి వారు చెబుతున్నా 50-30-20 ఫార్ములా ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, నెల నెలా వచ్చే జీతాన్ని మూడు భాగాలుగా విడగొట్టాలి. ఒకటి అవసరాల కోసం, రెండోది మనసుకు నచ్చిన ఖర్చుల కోసం, మూడో భాగాన్ని పోదుపు కోసం కేటాయించాలి. అవసరాల కోసం శాలరీలో 50 శాతాన్ని కేటాయించాలి. ఇక ఇష్టాయిష్టాలు తీర్చుకునేందుకు మరో 30 శాతం ఖర్చు పెట్టొచ్చు. చివరిగా మిగిలిన 20 శాతాన్ని మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలి. ఈ స్మార్ట్ ప్లాన్‌ను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తే జీవిత చరమాంకంలో ఇబ్బందీ ఉండదు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ ఫార్ములాతో ఇప్పటికే లాభపడ్డారు కూడా.


అవసరాలు

మనిషి జీవించేందుకు కావాల్సిన వాటిని అవసరాలని అంటారు. వీటి కోసం పన్ను చెల్లించగా మిగిలిన జీతంలో 50 శాతాన్ని కేటాయించాలి. ఈ బడ్జెట్‌కు మించి అవసరాలు ఉంటే వెంటనే లైఫ్‌ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు ఇంటి అద్దె, పచారీ సామాన్లు, వైద్యం, ఇన్సూరెన్స్ వంటి వాటిల్లో సర్దుబాటు చేసుకోవాలి.

ఇక బతకడానికి అవసరం కానివన్నీ కోరికల కిందకే వస్తాయి. వీటి కోసం శాలరీలో 30 శాతం వరకూ ఖర్చు పెట్టొచ్చు. ఉదాహరణకు మీకు నచ్చిన లగ్జరీ కారు కొనుగోలు, ఏదైనా ఫారిన్ ట్రిప్, నచ్చిన సినిమాకు వెళ్లేందుకు చేసే ఖర్చులు కోర్కెల విభాగంలోకే వస్తాయి. ఈ ఖర్చులతో కేవలం భావోద్వేగ పరమైన సంతృప్తి మాత్రమే కలుగుతుంది. మనసును అదుపులో పెట్టుకుంటే ఇవి లేకపోయినా సంతోషంగా ఉండొచ్చు.


పొదుపు

ఇక భవిష్యత్తు అవసరాలు, అత్యవసర సందర్భాల్లో అక్కరకు వచ్చేదే పొదుపు చేసిన డబ్బు. జీతంలో కనీసం 20 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా పొదుపు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా పొదుపు చేసిన సొమ్ములో కొంత భాగాన్ని పెట్టుబడిగా మారిస్తే మరింత ప్రయోజనకరం. ముందు సేవింగ్స్ అకౌంట్ సాయంతో పొదుపు చేయడం ప్రారంభించి ఆ తరువాత స్టాక్ మార్కెట్‌ సాధానాల వైపు మళ్లొచ్చు.

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!

Read Latest and Business News

Updated Date - Jul 18 , 2025 | 03:05 PM