Share News

Longest Solar Eclipse: 21వ శతాబ్ధంలో సుదీర్ఘ సూర్య గ్రహణం.. 6 నిమిషాల పాటు అంధకారం..

ABN , Publish Date - Nov 26 , 2025 | 03:37 PM

2027, ఆగస్టు 2వ తేదీన 21వ శతాబ్ధంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్య గ్రహణం చోటుచేసుకోనుంది. సూర్య గ్రహణం ఏర్పడ్డ ప్రాంతాలు మొత్తం 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలో ఉండనున్నాయి.

Longest Solar Eclipse: 21వ శతాబ్ధంలో సుదీర్ఘ సూర్య గ్రహణం.. 6 నిమిషాల పాటు అంధకారం..
Longest Solar Eclipse

2027లో ఓ అద్భుతం జరగబోతోంది. కొన్ని తరాల పాటు గుర్తుపెట్టుకునే సంఘటన ఒకటి చోటుచేసుకోబోతోంది. ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఒక్క సారిగా అంధకారంలోకి వెళ్లిపోనున్నాయి. పట్ట పగలు నిశి చీకట్లు కమ్ముకోనున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఆకాశంలో చుక్కలు కనిపించనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే భూమి తిరగటం ఆగిపోయిందా అన్నట్లు అనిపించనుంది. ఇలా జరగడానికి అత్యంత అరుదైన కారణం ఉంది. 2027, ఆగస్టు 2వ తేదీన 21వ శతాబ్ధంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్య గ్రహణం చోటుచేసుకోనుంది.


సూర్య గ్రహణం ఏర్పడ్డ ప్రాంతాలు మొత్తం 6 నిమిషాల 23 సెకన్ల పాటు అంధకారంలో ఉండనున్నాయి. గత వందేళ్లలో ఇలాంటి సూర్య గ్రహణం చోటుచేసుకోవటం ఇదే మొదటి సారి అవ్వనుంది. ఈ సూర్య గ్రహణం మొదటగా అట్లాంటిక్ మహా సముద్రంలో మొదలవ్వనుంది. చంద్రుడి ఛాయలు సూర్యుడిని కమ్మేయనున్నాయి. దక్షిణ స్పెయిన్, మొరాక్కో, అల్జీరియా, తునిషియా, లిబియా, ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లనున్నాయి. ఆరున్నర నిమిషాల పాటు సూర్యుడి జాడ కనిపించకుండా పోనుంది.


సౌత్ అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు బ్రెజిల్ దేశం కూడా ఈ అద్భుతానికి వేదికకానుంది. ఈ సుధీర్ఘ సూర్య గ్రహణంపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే.. ‘సాధారణంగా సంపూర్ణ సూర్య గ్రహణం ప్రతీ 18 నెలల కొకసారి జరుగుతుంది. 2027లో జరగబోయే సూర్య గ్రహణం మాత్రం ప్రత్యేకమైనది. 6 నిమిషాల పాటు సూర్య గ్రహణం ఉండటం వల్ల.. ఆస్ట్రానమీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, జంతువుల ప్రవర్తనపై పరిశోధనలు చేయడానికి అవకాశం ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, స్పేస్ ఏజెన్సీలు దీన్ని లైవ్ సైంటిఫిక్ ల్యాబొరేటరీగా మలుచుకోనున్నాయి. పలు పరిశోధనలు జరగనున్నాయి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఈ క్రెడిట్ మా టీమ్ మొత్తానిది.. విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా

వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..

Updated Date - Nov 26 , 2025 | 04:01 PM