Nagababu: ఒక్కరోజే 10 వేల కోట్లు జమ అద్భుతం
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:52 AM
అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కల్యాణ్ అని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. ఆస్టేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు, వీర మహిళలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కల్యాణ్ అని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు అన్నారు. ఆస్టేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు, వీర మహిళలతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేనపై అభిమానంతో పార్టీకి ఆర్థిక సహకారం అందిస్తున్న పెర్త్ నగరంలోని జనసేన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలన ఏడాది కాలంలోనే ప్రజలకు చేరువైంది. పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతం అవుతున్నారు. తల్లికివందనం పథకంలో భాగంగా 67 లక్షల మంది చిన్నారులకు రూ.10,091 కోట్లు ఒకే రోజు అర్హుల ఖాతాల్లో జమ చేయడం అద్భుతమైన అంశం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోంది’ అని నాగబాబు అన్నారు.