YSRCP Leader Ambati Rambabu: వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబుపై కేసు
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:28 AM
అంబటి రాంబాబుపై పోలీస్ కేసు నమోదు అయింది. పోలీసులను బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ BNS 188, 126(2), 851(8), 188(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది.
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబుపై పోలీస్ కేసు నమోదు అయింది. అంబటి రాంబాబుతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నేతలపై కూడా కేసు నమోదు అయింది. పోలీసులను బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ BNS 188, 126(2), 851(8), 188(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని అధికారులు చర్యలకు సిద్ధం అయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
నిన్న ( బుధవారం) వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా 'ప్రజాపోరు' నిరసన ర్యాలీలు చేపట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. అయితే, ఆ ర్యాలీలకు పోలీసులనుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ నిబంధనలని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ మాత్రం అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా ర్యాలీలు చేపట్టింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఎంతగా చెబుతున్నా అంబటి రాంబాబు వినకుండా పోలీసులతోనే దురుసుగా ప్రవర్తించి రచ్చ రచ్చ చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి సైతం దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఏపీకి మరో భారీ పెట్టుబడిపై మంత్రి లోకేష్ సంచలన ట్వీట్
కిడ్నీ మార్పిడి.. @ మదనపల్లె టు బెంగళూరు